రివ్యూ : మ్యాన్షన్‌ 24( హాట్ స్టార్ వెబ్ సిరిస్) – Telugu360

యాంకర్ గా పాపులరైన ఓంకార్ ‘రాజుగారి గది’ ఫ్రాంఛైజీ తో ఫిల్మ్ మేకర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు. హారర్ కామెడీ మిక్స్ చేసి రాజుగారి గది ఫ్రాంఛైజీ వుంటుంది. ఐతే ఈసారి కేవలం హారర్ ఎలిమెంట్ తో ‘మ్యాన్షన్‌ 24’ వెబ్‌ సిరీస్‌ తీశారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరిస్ ప్రేక్షకులని ఎంతలా భయపెట్టింది? ‘మ్యాన్షన్‌ 24’ చుట్టూ ఎలాంటి రహస్యాలు వున్నాయి?

అమృత (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. అమృత తండ్రి కాళిదాస్‌ (సత్యరాజ్‌) ఆర్కియాలజిస్ట్‌. పురావస్తు తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో దేశం వదిలిపారిపోయాడని కాళిదాసుపై దేశద్రోహి ముద్రపడుతుంది. ఎంతో నిజాయితీపరుడైన తన తండ్రిపై ఇలాంటి ముద్రపడటంతో అమృత షాక్ అవుతుంది. అసలు దిని వెనుక ఎవరున్నారనే పరిశోధన మొదలుపెట్టిన అమృతకు.. తన తండ్రి చివరిగా వెళ్ళిన పాడుబడ్డ మ్యాన్షన్‌ గురించి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన అమృతకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? చివరికి తన తండ్రి ఆచూకీ దొరికిందా లేదా? అనేది తక్కిన కథ.

ఈ వెబ్ సిరిస్ తొలి సీజన్ ని ఆరు ఎపిసోడ్స్ గా విడగొట్టాడు దర్శకుడు. ఈ ఆరు ఎపిసోడ్స్ కి లింక్ పెట్టామని అనుకోవడానికి తప్పితే.. ఇందులో ఓ కథకు మరో కథతో సంబంధం వుండదు. ఒక కథలో పాత్ర మరో కథలో కీలకం కాదు. అమృత మ్యాన్షన్‌లో గాయపడి స్ప్రూహ కోల్పోయిన సన్నివేశంతో ఈ కథమొదలౌతుంది. తర్వాత కాళిదాసు పాత్ర ఆచూకీ లేకుండా పోవడం, మ్యాన్షన్‌ చుట్టూ ఇచ్చే బిల్డప్ కొంతలో కొంత ఆసక్తిగా వుంటాయి. ఎప్పుడైతే అమృత, మ్యాన్షన్‌ వాచ్ మ్యాచ్ ( రావురమేష్)చెప్పే ఒకొక్క రూమ్ కథ వింటూ కూర్చుటుందో .. ఇంక ఈ సిరిస్ లో విషయం లేదనే సంగతి ఒకొక్క ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చేస్తుంది.

మ్యాన్షన్‌ రూమ్‌ నంబర్‌ 504లో రచయిత చతుర్వేది (శ్రీమాన్‌)తో ఒక ఎపిసోడ్ నడిపారు. ప్రతి సీన్ లో భయపెట్టేసి చివర్లో భ్రమ అనేశారు. రూమ్ నెంబర్ 203లో స్వప్న (అవికా గోర్‌) కథ కూడా ఇంతే. రాజీవ్‌ కనకాల తో చేసిన కథ అయితే ఢిల్లీ సామూహిక ఆత్మహత్యలని గుర్తు చేస్తుంది. నందు, బిందు మాధవి కథ హాలీవుడ్ సైకో సినిమాలకి స్ఫూర్తిగా వుంటుంది. అర్చన జోయిస్ తో చేసిన కథ అయితే సాయి పల్లవి చేసిన కణం సినిమా లాంటి కాన్సప్ట్.

ఇక చివర్లో రూమ్‌ నంబర్‌ 24 వస్తుంది. ఈ సిరిస్ అసలు పాయింట్ ఇదే. ఈ ఒక్క ఎపిసోడ్ కథ చెప్పడానికి మిగతావన్నీ ఫిల్లర్ లా వాడుకొని లాజిక్ పక్కన పెట్టేసి భ్రమ తో భయపెట్టేయాలనే ప్రయత్నం జరిగింది. అయితే ఈ భయాలు కూడా అంత టెర్రిఫిక్ గా వుండవు. గతంలో యాంకర్ గా వున్నపుడు ఓంకార్ చిన్నపిల్లలతో పిల్ల రాక్షుసుడు అంటూ టీవీలో ఏవో గేమ్ షోస్ చేసారు. ఈ మ్యాన్షన్‌లో చూపించిన హారర్ కూడా అలాంటిదే. ఇందులో సౌండ్ ఎఫెక్ట్స్ తప్పితే కంటెంట్ లో సౌండ్ లేదు.

ఈ సిరిస్ లో చెప్పుకోదగ్గ విషయం మంచి స్టార్ కాస్ట్ ని తీసుకున్నారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌, రావు రమేశ్‌, అవికా గోర్‌, రాజీవ్‌ కనకాల, అభినయ, నందు, బిందు మాధవి ఇలా అందరూ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే వాళ్ళకి సరైన పాత్రలు రాసుకోలేదు. వరలక్ష్మీ పాత్ర కేలవం డైలాగులకే పరిమితం చేశారు. ప్రతి కథ వినడం, అందులో లాజిక్ ని పట్టుకొని వివరించడం. ఐతే రెండో ఎపిసోడ్ నుంచే ఆమె చెప్పే లాజిక్కులు ప్రేక్షకుడికి ముందే అర్ధమైపోతాయి. అంత నీరసంగా వుంది రైటింగ్. రావు రమేష్ పాత్ర గురించి ప్రేక్షకుడికి ముందే హింట్ వుంటుంది. అందుకే ఆ ట్విస్ట్ రివిల్ అయినప్పుడు పెద్ద షాక్ రాదు. నందు, బిందు మాధవి ట్రాక్ కాస్త పైశాచికత్వంతో వుంటుంది. సత్యరాజ్ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. మిగతా అందరూ భయపెట్టడానికి తమవంతు ప్రయత్నం చేశారు.

వికాస్ బదిసా నేపధ్య సంగీతం మాత్రం బావుంది. హారర్ లేని చోట కూడా భయపెట్టే మ్యూజిక్ స్కోర్ చేశారు. హారర్ కంటెంట్ కు ప్రొడక్షన్ డిజైన్ చాలా ముఖ్యం. ఇందులో ఒక మ్యాన్షన్‌ ని చూపించారు కానీ .. దాని ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ ని సరిగ్గా ఎస్టాబ్లెస్ చేయలేదు. ఒక ఎక్స్ టీరియర్ షాట్ చూపించి.. మిగతాదంతా ఎదో ఒక రూమ్ లో షూట్ చేసినట్లుగా వుంటుంది కానీ ఆ మ్యాన్షన్‌ లో జరుగుతున్న కథలనే కనెక్షన్ ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయలేకపోయారు. లైటింగ్ ఇంకాస్త డెప్త్ గా వుండాల్సింది. రైటింగ్ పరంగా చాలా నిరాశపరుస్తుంది మ్యాన్షన్‌ 24. ఇందులో మాటలు క్రుతిమంగా అనిపిస్తాయి. మామూలు మాటల్ని కూడా ఎదో డైలాగుల్లా రాసేయలనే తాపత్రయం కనిపిస్తుంది. ముఖ్యంగా రావురమేష్, వరలక్ష్మీ మాట్లాడుకునే విధానం చూస్తే.. లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే సినిమాలో గుండు సుదర్శన్ పాత్ర గుర్తుకొస్తుంది. అంత ఓవర్ డ్రమటిక్ గా వున్నాయి డైలాగులు. ప్రతి సన్నివేశంతో భయపెట్టేయాలని తాపత్రయయం దర్శకుడిలో కనిపించింది కానీ దానికి సరిపడా కథ, కథనాలు తోడవ్వలేదు.

Telugu360 is at all times open for the most effective and vivid journalists. If you’re excited by full-time or freelance, electronic mail us at Krishna@telugu360.com.

Adblock check (Why?)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Bollywood Divas Inspiring Fitness Goals

 17 Apr-2024 09:20 AM Written By:  Maya Rajbhar In at this time’s fast-paced world, priori…