90s web series review: శివాజీ నటించిన ‘#90s’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే.. – Eenadu
90s internet collection assessment: వెబ్‌సిరీస్: 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్; నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు; సంగీతం: సురేష్ బొబ్బలి; ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి; సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్; నిర్మాత: రాజశేఖర్ మేడారం; రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
శివాజీ (Sivaji), వాసుకీ (Vasuki) ఆనంద్ సాయి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు?
కథేంటంటే: చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. ఆయనకు భార్య రాణి (వాసుకీ ఆనంద్ సాయి), పిల్లలు రఘు తేజ (మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్ రాయ్) ఉన్నారు. ప్రతిదీ లెక్క పెట్టుకుని ఖర్చు చేసే మనస్తత్వం ఉన్న చంద్రశేఖర్.. పిల్లల చదువు విషయంలోనూ అంతే కఠినంగా ఉంటాడు. రఘు, దివ్య బాగానే చదువుతున్నా.. నూటికి నూరు మార్కులు రావాలంటాడు. ఆదిత్యకు చదువు సరిగా అబ్బదు.(90s internet collection assessment). పదో తరగతి చదువుతున్న రఘుకు.. జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తండ్రి ఆశిస్తాడు. మరి ఆ రికార్డు సాధించాడా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? మధ్య తరగతి కుటుంబంలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ర్యాంకుల కోసం ప్రైవేటు స్కూల్స్ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తెస్తున్నాయి? వాటిని తట్టుకోలేక చిన్నారులు పడే మనోవేదన ఏంటి?.. తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, కౌమర దశలు మర్చిపోలేని అనుభూతులను ఇస్తాయి. ఇప్పుడంటే అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది. కానీ, రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇలా లేవు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే ల్యాండ్‌ఫోన్‌లు, ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప మరోమార్గం లేదు. ఇక ఇంటికి చుట్టాలొస్తే పిల్లలకు పండగే. అలాంటి ఎన్నో అందమైన అనుభూతులను సొంతం చేసుకున్న 90వ దశకం పిల్లల జ్ఞాపకాలను.. అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ఆదిత్య హాసన్ విజయం సాధించారు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లి.. మళ్లీ ఆ మధుర స్మృతులను గుర్తు చేశారు. సిరీస్ ప్రారంభంలో ‘మిడిల్‌క్లాస్ లైఫ్‌స్టైల్‌లో పెద్ద కష్టాలు, కాన్‌ఫ్లిక్ట్‌లు ఏమీ ఉండవు. ఇది పెద్ద కథేం కాదు. కేవలం మన అనుభవాలు మాత్రమే. అంచనాలు పెట్టుకోకుండా చూసేయండి’ అని రఘుతేజ చెబుతాడు. అన్నట్లుగానే సిరీస్ మొత్తం అలా చూస్తూ వెళ్లిపోతాం. మరీ ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతాం (90s internet collection assessment telugu).
చంద్రశేఖర్ వ్యవహారశైలి, భార్య, పిల్లల మనస్తత్వాలను పరిచయం చేస్తూ మొదలైన సిరీస్ ఆద్యంతం అంతే ఆసక్తిగా సాగుతుంది. మన ఇంటికి మావయ్యో, తాతయ్యో వచ్చి వెళ్లేటప్పుడు ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇవ్వటం, క్రికెట్‌లో బెట్టింగ్ కట్టి ఓడిపోతే ఆ డబ్బులు పోగేసేందుకు చేసే ప్రయత్నాలు, పిల్లలు సరిగా చదవడం లేదని కేబుల్ టీవీ కనెక్షన్ తీయించే తల్లిదండ్రులు, ఇతరుల పిల్లలు బాగా చదువుతున్నారని మన తల్లిదండ్రులు పెట్టే పోలికలు ఇలా ప్రతి సగటు మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను హృద్యంగా చూపించారు. ఇక పదో తరగతి వచ్చే సరికి పిల్లల్లో ఏర్పడే ఆకర్షణలను చూపించిన తీరు.. నవ్వులు పంచుతూనే అందంగా ఉంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో జ్ఞాపకాల దొంతరలు కనిపిస్తూనే ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత ఒంటరిగా కూర్చొంటే మన బాల్యం కళ్ల ముందు ఫ్లాష్ అవుతుందంటే దర్శకుడు మనల్ని సిరీస్‌కు ఎంతలా కనెక్ట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
ఎవరెలా చేశారంటే: లెక్కల మాస్టార్‌గా చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు. బిగ్‌బాస్‌తో కొత్త జర్నీ మొదలు పెట్టిన ఆయన.. ఇప్పుడు వెబ్‌సిరీస్‌తో సరికొత్తగా మళ్లీ ట్రాక్ ఎక్కారు. ఒకరకంగా మధ్యతరగతి తండ్రికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. వాసంతి, స్నేహాల్ కామత్ చక్కగా నటించారు. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ నవ్వులు పంచుతుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి టీమ్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ‘పిల్లలు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రోత్సహించని పేరెంట్స్, టీచర్లు, వాళ్లు కష్టపడి సాధించిన తర్వాత ప్రశంసించే హక్కు కోల్పోతారు’ వంటి సంభాషణలు బాగున్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
ఫ్యామిలీతో చూడొచ్చా: నూటికి నూరు పాళ్లు కుటుంబమంతా కలిసి చూసే వెబ్‌సిరీస్ ఇది. కుదిరితే మీ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి చూడండి. ఈటీవీ విన్‌లో (ETV Win) స్ట్రీమింగ్ అవుతోంది.
బలాలు
+ నటీనటులు
+ కథ, దర్శకత్వం
+ సాంకేతిక విభాగం పనితీరు
బలహీనతలు
– అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: అందమైన అనుభూతులను ఇచ్చే ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Adblock take a look at (Why?)