Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush evaluate; చిత్రం: ఓం భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు; ఛాయాగ్రహణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR; కళ: శ్రీకాంత్ రామిశెట్టి; కూర్పు: విజయ్ వర్ధన్; నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు; రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి; సమర్పణ: యు.వి.క్రియేషన్స్; విడుదల: 22-03-2024
ఈవారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. రెండు మూడు సినిమాలు విడుదలైనా అగ్ర హీరోలు నటించినవేవీ లేవు. విడుదలైనవాటిలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రమే ప్రధాన ఆకర్షణ. ‘సామజవరగమన’తో నవ్వించిన ఆయన మరోసారి కామెడీనే ఆశ పెడుతూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. శ్రీవిష్ణుకి తోడుగా కామెడీ గ్యాంగ్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడు కావడం… ప్రచార చిత్రాలూ ఆసక్తిని రేకెత్తించచడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా?(om bhim bush evaluate) వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి?
కథేంటంటే: లెగసీ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులు బ్యాంగ్ బ్రదర్స్ క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్ రామకృష్ణ). వీళ్లు చేసే పనులు భరించలేక తక్కువ సమయంలోనే ముగ్గురికీ డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కళాశాలలోని ప్రొఫెసర్. దాంతో భైరవపురం చేరుకుంటారు. యూనివర్సిటీ జీవితంలాగే ఆ ఊళ్లో కూడా జల్సాగా బతకాలని నిర్ణయించుకుని సైంటిస్టుల అవతారమెత్తుతారు. ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో ఓ దుకాణం తెరిచి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తామని ప్రచారం చేసుకుంటారు. కానీ ఈ ముగ్గురూ నిజమైన సైంటిస్టులు కాదని, ఊరి జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారనే విషయం బయట పడుతుంది. దాంతో ఊరి సర్పంచ్ ఓ పరీక్ష పెడతాడు. సంపంగి మహల్లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే నిజమైన సైంటిస్టులని నమ్ముతామని చెబుతాడు. దెయ్యం ఉన్న ఆ మహల్లోకి నిధి కోసం వెళ్లాక ఈ బ్యాంగ్ బ్రదర్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇంతకీ ఆ మహల్లో ఉన్న సంపంగి దెయ్యం కథేమిటి? అసలు వాళ్లు నిధిని తీసుకొచ్చారా? తదితర విషయాలు తెలియాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే: నో లాజిక్ ఓన్లీ మేజిక్ అంటూ ఉపశీర్షికలో సూచించినట్టే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవలం మేజిక్‌నే నమ్ముకుని తెరకెక్కించిన సినిమా ఇది. ‘జాతిరత్నాలు’ తరహాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్రయాణానికి…. హారర్ కామెడీతో కూడిన ఓ కాన్సెప్ట్‌ని జోడించి కథని అల్లుకున్నాడు దర్శకుడు. దెయ్యాలు, ఆత్మలు అంటేనే ఆ కథల్లో లాజిక్స్‌ని వెదక్కూడదు. దెయ్యం భయపెట్టిందా లేదా అనేది చూడాలంతే. అసలు ఇలా ఎలా సాధ్యం అని ప్రశ్న వేసుకుంటే ఆ కథ అక్కడితో ఆగిపోయినట్టే. లాజిక్స్ జోలికి వెళ్లకుండా పాత్రలతోపాటే ప్రయాణం చేస్తే మాత్రం బ్యాంగ్ బ్రదర్స్ అక్కడక్కడా కొన్ని నవ్వుల్ని పంచుతారు. (om bhim bush evaluate) సంపంగి దెయ్యం కూడా కొద్దిమేర భయపెట్టి థ్రిల్ చేస్తుంది. స్నేహితులైన బ్యాంగ్ బ్రదర్స్ కళాశాలలోకి చేరి ప్రొఫెసర్ని మాటలతో బురిడీ కొట్టించడం నుంచి కథ మొదలవుతుంది. ఆ కథ భైరవపురం చేరుకున్నాక, ఆ తర్వాత ఊళ్లో ఎ టు జెడ్ సర్వీసెస్ మొదలయ్యాక అసలు సిసలు హంగామాకి తెర లేస్తుంది. ముగ్గురూ చేసే క్రేజీ పనులు నవ్విస్తాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడుతున్న ఓ వ్యక్తికి అంగస్తంభనల కోసం వైద్యం చేయడం, సర్పంచ్ ఇంట్లోకి ముగ్గురూ వెళ్లి చేసే అల్లరి ప్రథమార్ధానికి హైలైట్.
ద్వితీయార్ధంలో కథంతా కూడా సంపంగి మహల్లోనే సాగుతుంది. అక్కడ దెయ్యం రాహుల్ రామకృష్ణనీ, ప్రియదర్శినీ భయపెట్టే సన్నివేశాల్లో పండిన హారర్, కామెడీ సినిమాపై ప్రభావం చూపిస్తుంది. సంపంగి దెయ్యం కథతోపాటు, పతాక సన్నివేశాల్లో ఎల్.జి.బి.టి అంశాన్ని స్పృశించిన తీరు కూడా మెప్పిస్తుంది. నవ్వించడం కోసం అక్కడక్కడా ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణల్ని వాడుకున్నాడు దర్శకుడు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైమింగ్ వల్ల వన్ లైనర్స్ బాగా పేలాయి. ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించవు. ట్రెజర్ హంట్ నేపథ్యం ఉన్నా ఆ సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. కథ పరంగా ఆఖర్లో మెప్పించిన ఈ సినిమా, కామెడీ పరంగా కొన్ని కొన్ని ఎపిసోడ్లుగా ప్రభావం చూపించింది.
ఎవరెలా చేశారంటే: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి పండించిన కామెడీ సినిమాకి ప్రధానబలం. వీళ్ల మధ్య టైమింగ్ చాలా సన్నివేశాలకి బలం తీసుకొచ్చింది. కథానాయికలు ప్రీతిముకుందన్, ఆయేషాఖాన్‌లకు కథలో ప్రాధాన్యం తక్కువే. రచ్చ రవి, ఆదిత్య మేనన్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్, కళ తదితర విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. బంగ్లా, దెయ్యం, తీరని కోరిక తదితర అంశాలన్నీ పాతవే. ఆ పాత కథకి కొత్తగా హాస్యాన్ని మేళవించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. చివర్లో సందేశం కూడా కొత్తదే. నిర్మాణం పరంగా లోటుపాట్లేవీ కనిపించవు.
- బలాలు
- + హాస్యం
- + శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటన
- + పతాక సన్నివేశాలు
- బలహీనతలు
- – తెలిసిన కథే
- చివరిగా: ఓం భీమ్ బుష్… కొన్ని నవ్వులతో మాయ చేస్తుంది.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే