Save The Tigers 2 OTT Review ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్.. సేవ్ ది టైగర్స్ 2 వెబ్ సిరీస్ రివ్యూ – Filmibeat Telugu
Opinions
oi-Rajababu A
Up to date: Saturday, March 16, 2024, 0:09 [IST]
Score:
/5
నటీనటులు: సీరత్ కపూర్, ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమటం, హర్ష వర్ధన్, గంగవ్వ, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, రోహిణి, ముక్కు అవినాష్, పావని గంగిరెడ్డి, శ్రీకాంత్ అయ్యాంగర్, వేణు ఎల్దండి తదితరులు
రచన: మహీ వీ రాఘవ్, ప్రవీణ్ అద్వైతం
దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి
నిర్మాతలు: మహీ వీ రాఘవ, చిన్న వాసుదేవ్ రెడ్డి
మ్యూజిక్: అజయ్ అరసదా
సినిమాటోగ్రాఫర్: ఎస్‌వీ విశ్వేశ్వర్
ఎడిటర్: శ్రావణ్ కటికనేని
ఓటీటీ రిలీజ్: డిస్నీ హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-15
సినీ హీరోయిన్ హంసలేఖ కిడ్నాప్ కావడంతో అనుమానితులుగా భావించి గంటా రవి( ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (చైతన్య కృష్ణ) అదుపులోకి తీసుకొని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. హంసలేఖను కిడ్నాప్ చేసి ఏం చేశారని పోలీసులు వేధిస్తారు. ఆమెను హత్య చేశారనే అనుమానాలను మీడియా వ్యక్తం చేస్తుంది. ఆ క్రమంలో స్వయంగా హంసలేఖ వచ్చి పోలీసులకు వాస్తవం చెబుతుంది. దాంతో ఆ ముగ్గురిని వదిలివేస్తారు.
Razakar Collections 45 కోట్ల బడ్జెట్.. సూపర్ హిట్ టాక్.. కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
హంసలేఖ నిజంగానే కిడ్నాప్ అయిందా? హంసలేఖ ఎలా అదృశ్యమైంది? ఆమె మళ్లీ ఎలా పోలీసుల ముందుకు వచ్చింది? పోలీసుల స్టేషన్ నుంచి బయపడిన ఆ ముగ్గురి జీవితాల్లో ఏం జరిగింది? రవి, రాహుల్, విక్రమ్ భార్యలకు స్పందన (సత్యకృష్ణ)కు సంబంధమేమేమిటి? కార్పోరేటర్ టికెట్ ఇప్పిస్తానని రవికి ఎమ్మెల్యే ఎందుకు చెప్పాడు? గేటెడ్ కమ్యూనిటిలో ఫ్లాట్ కొనాలేన రవి భార్య (జోర్దార్ సుజాత) కోరిక తీరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవీయాని శర్మ) లాయర్ వృత్తిని ఎందుకు ఆపేసింది? హంసలేఖ సినిమాకు రాహుల్ కథ రాయాలనే కోరిక తీరిందా? రాహుల్, హారిక కలిసి చేసిన ఓ ప్రాజెక్టు ఎలా సాగింది? ముగ్గురు భార్య ఆశలు, ఆలోచనలకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సేవ్ ది టైగర్స్ 2 సీజన్ కథ.
![Save The Tigers 2 Web Series Review Save The Tigers 2 Web Series Review](https://images.filmibeat.com/te/img/2024/03/save-the-tiger-2-review-1710524773.jpg)
Tantra Overview క్షుద్ర శక్తులు, మంత్ర విద్యలతో తంత్ర.. అనన్య నాగళ్ల మూవీ ఎలా ఉందంటే?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ హిట్ తర్వాత అంచనాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సీజన్ 2 డిస్నీ హాట్ స్టార్‌లోకి వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు మించి మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతమ్ రాసిన కథ, కథనాలు పక్కాగా వర్కవుట్ అయ్యాయనే చెప్పాలి. వినోదం, ఎమోషన్స్ జోడించిన విధానం వల్లే సీజన్ 2 కూడా బాగా ఆకట్టుకొనేందుకు కారణమైందనే చెప్పాలి.
Sharathulu Varthisthai Overview మిడిల్ క్లాస్ బయోపిక్.. కామన్ మ్యాన్ కష్టాలు.. షరతులు వర్తిస్తాయి మూవీ రివ్యూ!
సీజన్ 1 మాదిరిగానే ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమ వంతు కామెడీని, ఎమోషన్స్‌ను పండించారు. అలాగే జోర్దార్ సుజాత తిట్ల వర్షం మరింత కామెడీని రాజేసింది. పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, తమదైన నటనతో ఆకట్టుకొన్నారు. సీరత్ కపూర్ గ్లామర్‌తో సీజన్2లో మెరుపులు మెరిపించింది. ప్రతీ ఎపిసోడ్ దేనికి అదే .. సాటిగా నిలిచింది. అయితే అక్కడక్కడా రొటీన్‌గా, రెగ్యులర్ కంటెంట్ ఉండటం, మరికొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా తెలుగు మరో మంచి వెబ్ సీరీస్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇండస్ట్రీ వాళ్లు వాడుకొని వదిలేస్తారు.. అనన్య నాగళ్ల
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం రచన ఈ వెబ్ సిరీస్‌కు బలంగా నిలిచింది. అజయ్ అరసదా మ్యూజిక్, ఎస్‌వీ విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫి, శ్రావణ్ కటికనేని ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్. మహీ వీ రాఘవ, వాసుదేవ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే ఎమోషన్స్, మంచి వినోదాన్ని అందించేలా ఉంటుంది. సీజన్ 1 ఇష్టపడిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది. కొత్తగా చూసే వారికి నచ్చతుంది. తీరిక వేళలో గానీ.. ఒకేసారి చూసినా మంచి అనుభూతిని పంచుతుంది.
English abstract
Mahi V Raghav’s newest Net Sequence Save The Tigers 2. It’s launched on Disney Scorching Star on March fifteenth. Priyadarshi, Abhinav Gomatam, Krishna Chaitanya, Seerat Kapoor, Pavani Gangireddy in lead roles. Right here is Filmibeat Telugu Overview.
Adblock check (Why?)